Pat Cummins: భారత్ భారీ ప్రయోజనం పొందుతోంది: ప్యాట్ కమిన్స్ 1 y ago
ఛాంపియన్స్ ట్రోఫీలో దుబాయ్ వేదికగా ఉండటం భారత్కు భారీగా ప్రయోజనం కలుగుతోందని ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అన్నాడు. పాకిస్థాన్కు వెళ్లేందుకు భారత్ నిరాకరించడంతో హైబ్రిడ్ పద్ధతిలో భాగంగా ఛాంపియన్స్ ట్రోఫీలో టీమ్ ఇండియా మ్యాచ్లన్నీ దుబాయ్లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. "టోర్నీ కొనసాగడం మంచిదనే అనుకుంటున్నా. కానీ ఒకే వేదికపై ఆడటం భారత్కు భారీగా ప్రయోజనం కలుగుతోంది. ఇప్పటికే భారత్ చాలా పటిష్టంగా ఉంది. మ్యాచ్లన్నీ దుబాయ్లె లోనే ఆడటం వల్ల టీమ్ ఇండియాకు స్పష్టంగా ప్రయోజనం చేకూరుతుంది” అని గాయంతో జట్టుకు దూరమైన కమిన్స్ పేర్కొన్నాడు. అయితే, ఇలాంటి వ్యాఖ్యలను తాను చేయలేదని కమిన్స్ సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టాడు. ఆస్ట్రేలియాకు చెందిన ఓ మీడియా పబ్లిష్ చేసిన వార్త వల్లే ఇదంతా జరిగినట్లు పేర్కొన్నాడు.